Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

ప్రేమా నీవెక్కడ...?













అయిందేదో అయింది... జరిగేదేదో జరుగుతుంది..
అని అనుకుంటే... ప్రేమ కోసం నా ఈ నిత్య నిరీక్షణ వృధానే..
నా ఆలోచనల్లో ప్రేమ ఉందో.. లేక... ఆలోచనలకు కారణమే ప్రేమయిందో...
తెలియదు కానీ... తికమకపెట్టే తియ్యటి తలపు... వలపై నన్నెప్పుడు వరిస్తుందా...
అని... కలలో మెదులుతూ... కనుల ముందే కదులుతూ.. ప్రశ్నలా వెంటాడుతోంది.
కవ్వించే... ప్రేమ కౌగిలి మాటున ఎన్నడు సేద తీరుతానా అని గుచ్చి గుచ్చి అడుగుతోంది.
ఇలా ఈ మౌనంలోని.. ఒంటరితనంలో వేదనతో నేనేమవుతానో.. నాకు తెలియదు..
కానీ.. నీ జాడ తెలిసే దాకా.. ఈ నిరీక్షణ ఆగిపోదు..
నిను చేరేదాకా.. నా ఆరధన అలసిపోదు
సాగరతీరాన ఎగసి పడుతున్న అలలా.. నా ప్రతి అణవులో
చావులోను... బ్రతుకులోను... ప్రేమాలాపన ఆలంబనగా చేసుకొని...
స్వాగతించు ముగ్ద మనోహర మకరంద పూవుల పరిమళాల సువాసనలా... ప్రేమజీవిగా...
బ్రతుకులో మమేకమై... జీవితపు తుది శ్వాస ఆగే వరకు... తపిస్తూ.. ఎదురు చూపులో...
ఆనందపు అంచుల దాకా వెళ్లి.. అందులో తృప్తిని.. అస్వాదిస్తాను..
చిందే ప్రతి కన్నీటి బొట్టును అమృతంలా చేసుకుని.. తియ్యటి బాధను గుండెల నిండా నింపుకునే..
అమూల్యమైన క్షణాన.. జీవితాన.. నే దాచుకున్నదంతా... సంపాదించిన ఆత్మీయతనంతా.. అందిస్తాను.
సంధ్య వెలుగులో వింజామరల తాకిడికి పరవశించిన
నా గుండె చప్పుళ్లను వినిపిస్తాను..
కానీ.. నువ్వుండేదెక్కడో.. నేను తెలుసుకునేదెలా...?
మసక తెరల మాటున ఉన్న నా మనసు నిన్ను చూసేదెలా..?





స్పందనలు

Re: ప్రేమా నీవెక్కడ...?
డియర్ రమేష్, నీ కవిత అంతా బాగానే ఉంది కానీ నీ ప్రేయసికి మాత్రం దీనిని పంపకు. ఎందుకంటే ఈ తరం అమ్మాయిలు చాంతాడంత పొడవు కలిగిన కవిత ఇంత చక్కటి పద విన్యాసాలతో కూడి ఉంటే చదవలేరు. చదివే ఓపిక కూడా వారికి లేదు. కాబట్టి తక్కువ పదాలతో నీ మదిలోని భావనను తేలిగ్గా చెప్పే ప్రయత్నం చేయడం మంచిది.
Re: ప్రేమా నీవెక్కడ...?
మీ కవితను చదువుతుంటే నా మనస్సు ఎక్కడికో పోతుంది. నేను శుద్దిగా పనిచేసుకుంటుంటే మీ కవితతో నా మనస్సును ఎక్కడికో తరిమారు ఈ రోజు నాకు నిద్దర రాదు ఎలా చేయను మిత్రమా.
Re: ప్రేమా నీవెక్కడ...?
కొందరికి నిద్దర రాని తరహా కవితలు కలం నుండి వస్తున్నాయంటే ప్రమాదపు అంచుల్లో ఉన్నట్లే లెక్క. అసలే క్యారెక్టర్లపై ఆమాంబాపతు శాల్తీలు తీర్పులు చెబుతున్న కాలమిది. ఏదన్న ఉంటే బయట తేల్చుకో గాని కాసింత జాగ్రత్తగా ఉంటే మంచిదేమో.. కవిత బాగానే ఉంది పొడుగ్గా.. దీర్ఘంగా... కానివ్వు.. మరి..
Re: ప్రేమా నీవెక్కడ...?
రమేష్ కవిత చాలా బాగుంది ఇలానే కొత్త కొత్త ప్రయోగాలతో మీరు మరిన్ని ప్రేమ కవితలు రాయాలని నేను ఆకాంక్షిస్తున్నాను...
నిరాకరణ