Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

నీవేనా...?






విరబూసే పువ్వుల్లో నవ్వుల వాన నీవేనా...
విశ్వవినీలాకాశంలో తెల్లటి మేఘానివి నీవేనా..
ప్రకృతి అందానికి పులకరించి జాలువారిన మేఘాల హర్షపు వర్షం నీవేనా...
సాగర సంగమాన... శృతి, లయల సంగీతాన... సంధ్యారాగం నీవేనా...
ఉషోదయాన ఉదయపు ఉజ్వల ప్రజ్వల రవికిరణాల కాంతివి నీవేనా...
మరుమల్లెల మాలలుగ సుతిమెత్తని మనసు మాటున మౌనరాగాల హారానివి నీవేనా...
జాజి పూల తోటలో సన్నజాజి తీగపు తొలకరి నును సిగ్గువు నీవేనా..
ఊసుల ఊహల ఊయల లోకంలో ఆనందపరిమళత్వం నీవేనా...
ఎదుట పడి... యదలో లయాలాపన రేపింది నీవేనా...
నిదురరాని కనుపాపలో... కదులుతుంది నీవేనా...
కలలు లేని ఈ కన్నీటి జీవితానికి... చిగురుటాశల స్వప్నం నీవేనా...
తుది వరకు నాతోనే ఉండే... ఈ స్నేహం నీదేనా...





స్పందనలు

Re: నీవేనా...?
చాలా బాగవుందండి మీ కవిత ఇంకా ఇటువంటివి చాలా వ్రాయమని వినపం. అలాగే మీరు నా బ్లాగ్ కూడ చూచి కొంచం మీ సలహాలను వ్రాయమని వినపం. www.prematho.mywebdunia.com
Re: నీవేనా...?
కవిత బాగుంది. సార్ మీకో సూచన "చిగురాటశల" ఈ పదానికి అర్థం ఏమిటో అర్థం కాలేదు. అక్షరదోషం ఉందేమో చూసుకోండి.
Re: నీవేనా...?
మిత్రమా తెలీకడుగుతాను.. ఈ రోజుల్లో... అంటే గ్లోబలైజేషన్ యుగంలో పరదాలు, అలంకారాలు, చందస్సులు, ప్రాసలు చెరిగిపోతున్న ఈ రోజుల్లో ఇంత పదడాంబికం అవసరమా.. కవిత్వం రాయాలనే ఆ కుతూహలం మంచిదే.. కాీ మరీ ఇంతగానా... కవిత్వంలో ఎకానమీ ఆఫ్ వర్డ్స్ గురించి చలం మహాప్రస్థానంకి ఇచ్చిన యోగ్యతాపత్రంలో 60 ఏళ్లకు ముందే చాలా స్పష్టంగా చెప్పారు. ఇది నిజంగా ప్రేయసి కోసం బాధే అయితే ఈ పదభారాన్ని తను భరించలేదనుకుంటా.... ప్రకృతి కోసం బాధ అయితే ప్రకృతిని ఇలా వర్ణించడం ఇప్పటి కవితా సాంప్రదాయం కానేకాదు. ప్రేమను ఎంత సుతిమెత్తగా వర్ణించవచ్చో తెలుసుకోవడానికి ఇతరుల కవిత్వాన్ని చదవటం చాలా అవసరం... ఇది తప్పులెన్ను వ్యాఖ్య కాదని మనవి. "యదలో", "చిగురాటశల" ప్రయోగం ఎక్కడో గతి తప్పినట్లుంది సరిచేయాలి... అభినందనలతో....
Re: నీవేనా...?
రమేషూ నీ కవిత్వానికి మంచి ఊపు వచ్చేసిందయ్యా....ఇదే నీవేనా పరుగును కొనసాగించు....మేము చూస్తూనే ఉంటాం.
Re: నీవేనా...?
ముందుగా మీకు కృతజ్ఞతలు.. నా కవితను చదివి... మీ అమూల్యమైన అభిప్రాయాలతో పాటు సూచనలను అందించినందుకు నిజంగా సంతోషంగా ఉందండీ. ఇక ఒకప్పటి కవితా సరిళినే ఎందుకు ఈ కవితలో ఎంచుకున్నానో నాకు తెలియదు. ఏదో ఒకటి రాయాలని రాస్తూ... అలా వచ్చిందే తప్ప ప్రత్యేకించి దానిపై శ్రద్ధవహించలేదు. కానీ చివరలో మాత్రం కవితకు చిన్న చిన్న మార్పులు చేసి బ్లాగులో పెట్టాను. ఇందులో కొన్ని నాకు ఇష్టమైన పదాలు ఉన్నాయి.. ప్రకృతి లాంటి పదాలు. అందుకే దాదాపు నా కవితల్లో దాన్ని చేర్చాలనే కంకణం కట్టుకోకపోయినా.. ఎందుకో మరి.. అదలా..
Re: నీవేనా...?
Its really nice....keep going......
నిరాకరణ