Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

నీవు నా శ్వాసలో...






స్వాప్నిక లోకంలో దేవతవు నీవు...
కుదురుగ నిలువనీవు... కనుపాపలో కదులుతుంటావు...
నిదురనైన రానీవు... నీవు నేనంటావు...
ఊపిరినిచ్చే ఊహవు నీవు... నా ఊహలకు శ్వాసవు నీవు..
ఆశలకు జీవం నీవు... ఆలోచనలకు అంకురార్పణ నీవు...
సాగర తీరాన ప్రశాంతత నీవు... వెన్నెల వెలుగులో అందమైన ముగ్గువు నీవు..
తియ్యటి స్వరానివి నీవు... నా స్వరాలాపనకు ప్రాణం నీవు...
నా ప్రాణంలో శ్వాసవు నీవే...
కానీ... ఎదురుగ వస్తావు... ఎవరని నిలదీస్తావు...
కనుల ఎదుటే కలలా అలా అలా వెళ్లిపోతావు




స్పందనలు

Re: నీవు నా శ్వాసలో...
ఎవరు నాయనా! ఆ స్వప్న సుందరి... అయితే కవిత మాత్రం సింప్లీ సూపర్బ్
నిరాకరణ