Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Take a tour | Family Filter: On
Search  
Welcome, Guest  [ Register | Sign In ]

ప్రేమస్తు...

ప్రేమను ప్రేమగా పిలుస్తూ..


ప్రేమ వికసించిన వేళ


వేకువ జామున గాలి తెమ్మెరలా...
విరబూసే పూల స్పర్శలా....
కల శృంగార కవితలా....
తనువుప్పొంగే మధుర జ్ఞాపికలా...
చీరకట్టుకున్న పడుచు వన్నెలా....
హృదయ దేవతా వనిలా....
ఉప్పొంగే గోదావరిలా...
ఉషోదయ రవికిరణంలా...
చల్లని చందమామలా...
వెచ్చని కౌగిలిలా...
నా సహచరిలా...
ప్రియురాలిలాకలకాలం ఉండిపోవాలిలా.....
నాలో సగం లా... నా ప్రాణంలా....!










నీ జ్ఞాపకాలు

నీ జ్ఞాపకాలు నన్నో కవిని చేశాయి....
నువ్వన్నది నా జ్ఞాపకం కాదు....
నా కవితకు ప్రాణం....నా ఊహాశక్తికి జీవం....
చిగురించిన ఆశలకి తుదిరూపం..... నీవే.....
నీ జ్ఞాపకాలు నాలో మమేకమై.. అమృత బిందువులై...
అక్షర రూపంలో నాలోని ఊహాశక్తికి... నిలువెత్తు సాక్ష్యంగా...
కడదాకా.... తోడుగా... ప్రతిరూపంగా నిలిచిపోవాలని..... ఆశిస్తూ..











నీకై... నేను....

నిను చూసే వేళ అలలా నా తనువు ఉప్పొంగుతుంది...
గుండెల్లో గూడు కట్టుకున్న ఆశ మనసును ఊహల్లో విహరింప జేస్తుంది...
నీ చూపు నను తాకిన వేళ ఈ ప్రపంచాన్నే జయించినంత ఆనందం కలుగుతుంది...
చావైనా సరే... బ్రతుకైనా సరే... నీతోనే అనిపిస్తుంది...

నా ప్రేమను చెబుదామంటే మాటే మూగబోయింది...
వర్షపు జల్లుల్లో కన్నీటి చుక్కలా కలిసిపోయింది...

అయినా ... నా మనసు..
మబ్బుల చాటున ఉన్న చల్లని చందమామ రాకకై
ఎదురు చూస్తున్న ప్రకృతిలా....
నీ మాటకై వేచి చూస్తోంది.
నీ చేయి అందిస్తావని ఎదురు చూస్తోంది...
నీతో ఏడడుగులూ నడవాలని ఆశిస్తోంది...
కన్న కలలు నిజం కావాలని ఆరాటపడుతోంది....
ప్రాణాలివ్వడానికైనా సిద్ధం అంటోంది...





నిరాకరణ